సాయి బాబా తన అనుయాయులకు 11 వాక్యములు బోధించారు :
షిరిడిలో ఎవరు కాలు పెట్టినా సరే వారి బాధలు తీరిపోతాయి.
కష్టములలో మరియు బాధలలో ఉన్నవారు నా సమాధి మెట్లు ఎక్కిన వెంటనే చాలా చాలా సంతోషమును మరియు ఆనందమును పొందుతారు.
నేను నా మానుష శరీరమును విడిచి పెట్టిన తరువాత కూడా ఎప్పుడూ ఉత్సుకతతో పని చేస్తూనే ఉంటాను.
నా భక్తులకు నా సమాధి నుండి ఆశీర్వాదములు లభిస్తాయి, నా సమాధి వారి అవసరములకు సమాధానములు ఇస్తుంది.
నేను నా సమాధి నుంచి కూడా చురుకుగా మరియు ఉత్సుకతతో ఉంటాను.
నా సమాధి నుంచి నా ఎముకలు కూడా మాట్లాడతాయి.
నన్ను ఆశ్రయించిన వారికి, నన్ను శరణు చొచ్చిన వారికి నా సహాయము మరియు మార్గదర్శకత్వము ఎప్పుడూ లభిస్తూ ఉంటాయి.
నీవు నా వైపు చూస్తే నేను కూడా నీ వైపు చూస్తాను.
నీ భారమును నా పైన వేస్తే నేను దానిని తప్పకుండా భరిస్తాను.
నీవు నా సహాయము మరియు సలహాలను కోరినట్లైతే అవి నీకు వెంటనే లభిస్తాయి.
నా భక్తుల ఇంటిలో లేమి అనేది ఉండదు.
సాయి బాబా దర్శన సమయములు :
ఉదయము 4:00 గంటలకు
|
దేవాలయము తెరవబడుతుంది
|
ఉదయము 4.15 గంటలకు
|
భుపాలి
|
ఉదయము 4:30 గంటలకు
|
కాకడ హారతి ( ఉదయము )
|
ఉదయము 5:00 గంటలకు |
సాయి బాబా సమాధి మందిరములో భజన |
ఉదయము 5.05 గంటలకు
|
సమాధి మందిరములో శ్రీ సాయి బాబాకు పవిత్ర స్నానము ( మంగళ స్నానము ) |
ఉదయము 5:35 గంటలకు |
" షిర్డీ మాఝే పండరిపుర " హారతి |
ఉదయము 5:40 గంటలకు
|
సమాధి మందిరములో దర్శనము మొదలు అవుతుంది |
ఉదయము 9:00 గంటలకు
|
అభిషేక పూజ |
8:00,10:30
|
సత్యనారాయణ పూజ |
మధ్యాహ్నము 11:30 గంటలకు
|
ద్వారకామాయి లోని ధునికి అన్నము మరియు నెయ్యి లతో పూజ |
మధ్యాహ్నము 12:00 గంటలకు
|
మధ్యాహ్న హారతి |
సాయంత్రము 4:00 గంటలకు |
సమాధి మందిరములో పొథీ ( అధ్యాత్మిక అధ్యయనము/ పారాయణ |
సూర్యాస్తమయ సమయములో
|
ధూప్ హారతి
|
8:30 - 10:00 గంటలకు
|
సమాధి మందిరములో భక్తి గీతములు మరియు ఇతర సాంస్కృతిక కార్యక్రమములు (ఏవైనా ఉంటే) |
9:00 గంటలకు
|
చావడి మరియు గురుస్థాన్ లను మూసి వేస్తారు
|
9:30 గంటలకు
|
ద్వారకామాయిలో బాబాకు మంచి నీరు ఇవ్వబడుతుంది, ఒక దోమ తెర వేలాడతీస్తారు మరియు వేలాడే ఒక దీపము వెలిగించబడుతుంది. |
9:45 PM
|
ద్వారకామాయి ( పై భాగము ) మూసి వేయబడుతుంది |
10:30 PM
|
సేజ్ ( రాత్రి ) హారతి, దీని తరువాత సమాధి మందిరములోని బాబా విగ్రహమునకు ఒక శాలువా చుట్టబడుతుంది, బాబా మెడలో ఒక రుద్రాక్ష మాల వేస్తారు, ఒక దోమ తెర వేలాడతీయబడుతుంది మరియు ఒక గ్లాసుతో మంచి నీరు అక్కడ పెట్టబడుతుంది. |
11:15 PM
|
రాత్రి హారతి తరువాత మందిరము మూసి వేయబడుతుంది. |
షిరిడీకు దగ్గరలో ఉన్న రైలే స్టేషన్లు
సాయి నగర్ షిర్డీ |
దేవాలయము నుంచి 0.5 కిలోమీటర్ల దూరములో ఉన్నది |
మన్మాడ్ జంక్షన్ |
58 కిలోమీటర్లు |
కోపర్గావ్ ( డుండ్ మన్మాడ్ లైన్ ) |
16 కిలోమీటర్లు |
|
|
విమానాశ్రయము |
Distance From Shirdi |
నాసిక్ |
90 కిలోమీటర్లు . |
ఔరంగాబాద్ |
150 కిలోమీటర్లు . |
పూణే |
215 కిలోమీటర్లు . |
ముంబై |
282 కిలోమీటర్లు . |
|